మెగా ఫ్యామిలీని అవమానించడమే: బన్ని వాసు

SMTV Desk 2017-11-15 16:51:11  banni vasu, nandi award, mega family, geetha arts,

హైదరాబాద్, నవంబర్ 15: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై మెగా ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగింద౦టూ బన్ని వాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ బన్ని వాసు ఎవరు..? గీతా ఆర్ట్స్ గ్రూప్ లో బన్నీ వాసు ఓ కీలక వ్యక్తి. నంది అవార్డులపై ఆయన స్పందిస్తూ... " నేషనల్ అవార్డు అందుకున్న మగధీర సినిమాకు కూడా అప్పుడు అవార్డు ఇవ్వలేదు. మెగా హీరోలందరూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. కానీ ఏ ఒక్కరికి అవార్డు ఇవ్వకపోవడం మెగా ఫ్యామిలీని అవమానించడమే. అల్లు అర్జున్ ఈ మూడేళ్లలో రెండు హిట్ సినిమాలను అందించాడు. కానీ ఈ నంది అవార్డుల్లో అల్లు అర్జున్ కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వమేంటి " అని ఆవేదన వ్యక్తం చేశారు.