ముషారఫ్ మహా కూటమి..

SMTV Desk 2017-11-12 13:19:31  Pakistan Avami Itthahad, Pakistans former dictator Pervez Musharraf, Muslim League (Nawaz),

పాకిస్థాన్, నవంబర్ 12 : ముస్లిం లీగ్ (నవాజ్)ను ఎదుర్కోవడమే లక్ష్యంగా పాకిస్థాన్ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్ శనివారం 23 పార్టీలతో కలిసి మహా కూటమిని ఏర్పాటు చేశారు. పాకిస్థాన్ అవామీ ఇత్తెహాద్ (పీఏఐ) పేరుతో రానున్న ఈ కూటమికి ముషారఫ్ సారథ్యం వహించను౦డగా, ఇక్బాల్ దార్ సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ముషారఫ్ ఓ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఈ కూటమిలో అన్ని పార్టీలు చేరాలని అభ్యర్థించారు. ముత్తాహితా క్వామి మూమెంట్ (ఎంక్యూఎం), పాక్ సర్జామీన్ పార్టీ (పీఎస్‌పీ)లను ఆహ్వానించారు ముషారఫ్.