అందుకే ట్రంప్ కు వేలు చూపించా..

SMTV Desk 2017-11-12 11:19:04  America president Donald trump, woman lost the job, by showing finger,

వాషింగ్టన్, నవంబర్ 12 : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వేలు చూపించి ఉద్యోగం పోగొట్టుకున్న మహిళ గుర్తుందా..! ఆమె అలా ఎందుకు చూపించవలసి వచ్చిందో వివరణ ఇచ్చింది. నిత్యం ఎన్నో వివాదాలతో తన ఇష్టానుసారం ప్రవర్తించే ట్రంప్ కు ఎలాగైనా నిరసన తెలపాలన్న ఉద్దేశంతో పక్కా ప్రణాళిక ప్రకారమే అలా చేశానని తెలిపారు. తాను ఒక సంస్థలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ గా పనిచేస్తున్నానని, హెల్త్ పాలసీతో పాటు వివిధ అంశాలపై ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు సమంజసంగా లేవని ఆమె అభిప్రాయపడ్డారు. ట్రంప్ గోల్ఫ్ కోర్స్ కు వస్తారని తెలిసి, ఆ దారిలో ట్రంప్ కోసం ఎదురుచూశానని, సరిగ్గా ఆయన వచ్చినప్పుడు మధ్య వేలు చూపించి తన నిరసన వ్యక్తం చేశానన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు వైరల్ అవడంతో తనను ఉద్యోగం నుండి తొలగించారని, ప్రస్తుతం తను వేరే ఉద్యోగ౦ కోసం వెతికే వేటలో ఉన్నట్లు తెలిపారు.