ప్రేమించకపోతే ఫోటోలు పెట్టేస్తా...

SMTV Desk 2017-11-11 14:45:32  hyderabad, Harassment case,

హైదరాబాద్, నవంబర్ 11 : ప్రేమించకపోతే చంపేస్తా.. లేదంటే యాసిడ్ పోస్తా.. అని బెదిరించి ప్రేమ పేరుతో కసాయి ప్రేమికులు అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కానీ ఇప్పుడు ప్రేమించకపోతే మార్పింగ్ చేసిన అసభ్యకర చిత్రాలు బంధువులకు, స్నేహితులకు పంపుతానంటూ బెదిరిస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్బీనగర్ లోని హస్తినాపురంకి చెందిన యువతి (19)కి నెల రోజుల క్రితం ఒక సినిమా షూటింగ్ సమయంలో అమీర్ పేట ప్రాంతానికి చెందిన సమీర్ తో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ప్రేమించాలంటూ వెంటపడుతూ, వేధింపులకు గురి చేశాడు. ఒకవేళ ప్రేమించకపోతే ఆమె ఫోటోలు మార్పింగ్ చేసి, సోషల్ మీడియా ద్వారా ఆమె బంధువులు, స్నేహితులకు పంపుతానని బెదిరింపులకు దిగాడు. దీంతో యువతి ఎల్బీనగర్‌ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.