సైరా.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్..

SMTV Desk 2017-11-04 17:35:28  SAIRA NARASIMHA REDDY, SHOOTING STARTS OM DECEMBER 6TH.

హైదరాబాద్, నవంబర్ 04 : మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. పీరియాడికల్ మూవీగా తెరకెక్కనున్న ఈ విజువల్ వండర్, బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత నేపథ్యంలో తెరకెక్కను౦ది. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు. ఈ మూవీపై అభిమానులలో భారీ అంచనాలు ఉండగా, డిసెంబర్ 6ను షూటింగ్ డేట్ గా చిత్ర బృందం ఫిక్స్ చేసినట్టు సమాచారం. 1840 నాటి కథకి తగ్గట్టుగా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ హైదరాబాద్ లో భారీ సెట్ నిర్మిస్తున్నారు. చారిత్రాత్మక నేపధ్యంలో సాగే ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమంటా టాలీవుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.