హిమాచల్ లో ఎన్నికల ఫీవర్

SMTV Desk 2017-11-03 17:30:35  himachal elections, VVPAT Technology, Election Commission.

సిమ్లా, నవంబర్ 03 : హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల నగారా మోగింది. 68 నియోజక వర్గాలు, 5 లక్షల పైచిలుకు ఓటర్లున్న హిమాచల్ లో నవంబర్ 9 న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించి, డిసెంబర్ 18 న ఫలితాలను వెల్లడించనున్నట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఈ ఎన్నికల్లో దేశంలో మొదటిసారిగా రాష్ట్ర౦ మొత్తం వీవీపాట్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు ఈసీ మీడియాకు తెలిపింది. వీరభద్ర సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 36 అసెంబ్లీ సీట్లతో అధికారంలో ఉన్నది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీజేపీ 27 స్థానాలతో ఉన్నది. ఉత్తర భారతదేశంలో దాదాపు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ తన ఖాతాలో వేసుకుంటుండగా ప్రస్తుతం దాని కన్ను హిమాచల్ ప్రదేశ్ పై పడింది. ఇప్పటికే మోదీ, అమిత్ షా ద్వయం ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు జనవరి 7 తో ముగియనుంది. పలు న్యూస్ సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ, దాని విజయం నల్లేరుపై నడక కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.