130 సీల్ చేపలు మృత్యువాత..

SMTV Desk 2017-11-01 14:47:40  Russia Lake Baikal, 130 seal fishes died, pollution issue.

రష్యా, అక్టోబర్ 01 : రష్యాలో పర్యాటకుల తాకిడి ఎక్కువై కాలుష్యం కూడా బాగా పెరిగిపోయి౦ది. దీని వల్ల రష్యాలోని బైకాల్‌ సరస్సులో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన సీల్ చేపలు మృత్యువాత పడ్డాయి. ఏకంగా 130 సీల్ చేపలు చనిపోయాయి. ప్రపంచంలో లోతైన సరస్సుగా పేరొందిన ఈ బైకాల్ లో ఇటీవల గుంపులు గుంపులుగా చేపలు, ఇతర జీవులు చనిపోతున్నాయి. ఈ పరిణామానికి కారణం కాలుష్యం అనే వాదనతో అధికారులు ఏకీభవించడం లేదు. ఆ సీల్ చేపలకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు కేవలం గుండె కొట్టుకోవం ఆగడంతోనే ఈ చేపలు మరణించినట్లు నిర్ధారించారు.