సొరంగం కూలి 200 మంది మృత్యువాత..

SMTV Desk 2017-10-31 17:15:01  North koriya, Tunnel wreck hits 200 people,

ఉత్తర కొరియా, అక్టోబర్ 31 : ఉత్తర కొరియాలో భారీ సొరంగం కుప్పకూలిపోయిన ఘటనలో సుమారు 200 వందల మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన పుంగేరీ ప్రాంతం అణుప్రయోగ స్థలంలో చోటు చేసుకుంది. అక్టోబర్ 10 వ తేదీన మిలిటరీ సైట్ నిర్మాణ పనులు చేపడుతుండగా సొరంగం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ క్రమంలో సహాయం చేయడానికి వెళ్ళిన బృందాలు సహాయక చర్యలు చేపడుతుండగా ఆ సొరంగం పూర్తిగా కూలిపోగా మరో 100 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని జపాన్ మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది. కాగా ఈ విషయ౦పై ఉత్తరకొరియా స్పందించకపోవడం గమనార్హం. ఇటీవల ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబును పరీక్షించడంతో ఆ ప్రదేశం పూర్తిగా దెబ్బతిని ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.