2018లో సూపర్ స్టార్..2019లో సల్లు బాయ్..

SMTV Desk 2017-10-24 19:45:00  MAHESH BABU, SALMAN KHAN, BHARATH ANE NENU

హైదరాబాద్, అక్టోబర్ 24: ఇటీవల ‘స్పైడర్’ సినిమాతో అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం ‘భరత్ అనే నేను’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాను 2018లో విడుదల చేయనున్నారు. అసలు విషయం ఏంటంటే...’భరత్’ అనే టైటిల్ తో మరో సినిమా వస్తుందట. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘భరత్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని 2018లో చిత్రీకరణ మొదలయ్యి 2019లో విడుదల చేస్తారట. ఈ ఇద్దరు భరత్ లు ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తారో చూడాలి మరీ.