ఎంసీఏ ఫస్ట్ లుక్ విడుదల...

SMTV Desk 2017-10-18 18:32:01  nani, natural star, MCA first look, saipallavi,

హైదరాబాద్, అక్టోబర్ 18: వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాచురల్ స్టార్ నాని, ప్రస్తుతం ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీపావళి పండుగ సందర్బంగా నాని తన సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. తన ట్విట్టర్ వేదికగా... ‘ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. మీ మిడిల్ క్లాస్ అబ్బాయి ఫస్ట్ లుక్ ఇదిగో ‘ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ ఫోటోలో.. ఓ మధ్య తరగతి అబ్బాయిలా లుంగీ కట్టుకొని, పాల ప్యాకెట్లు పట్టుకొని నడిచోస్తూ, చిరునవ్వు చిందిస్తున్న నాని లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.