2500 పైగా థియేటర్లలో ‘మెర్సల్’...

SMTV Desk 2017-10-18 11:23:01  vijay, mersal, tamil theaters,

చెన్నై, అక్టోబర్ 18: తమిళ నటుడు విజయ్ నటించిన ‘మెర్సల్’ సినిమా దీపావళి కానుకగా తమిళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఏకంగా తమిళంలో 2500 పైగా థియేటర్లలో విడుదల కావడం విశేషం. ఇప్పటివరకు తమిళంలో ఈ స్థాయిలో ఏ సినిమా విడుదల కాలేదంటున్నారు సినీ వర్గాలు. ఇక తెలుగులో ఈ సినిమా ‘అదిరింది’ పేరుతో రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో మొత్తం 330 థియేటర్స్ ను కేటాయించారు. అటు ఓవర్సీస్ లోను 250 స్క్రీన్ లలో ఈ సినిమా ప్రదర్శితం కానుంది. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఇప్పటికే అత్యధిక బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది.