హిల్లరీపై ట్రంప్ వ్యంగ్యాస్రాలు..

SMTV Desk 2017-10-17 16:31:14  Washington, Amerika president, Donald trump, Hillary Clinton

వాషింగ్టన్, అక్టోబర్ 17 : అమెరికా అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ హోరాహోరీ గా తలపడిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో అనుకోని విధంగా విజయం సాధించిన ట్రంప్ వచ్చే ఎన్నికల్లో కూడా హిల్లరీనే పోటీ చేయాలని ఆమె మీద వ్యంగ్యాస్రాలు సంధించారు. అప్పటి ఎన్నికల్లో తన ఓటమికి బయటి శక్తులే కారణమంటూ హిల్లరీ ఆరోపించారు. ఈ విషయంపై ట్రంప్ స్పందిస్తూ.. "హిల్లరీ ప్లీజ్ నాతో మళ్ళీ పోటీ చేయవా!" అంటూ విమర్శించారు. ఆమె ఒక బలహీనమైన అభ్యర్థి అని, ఆమె చేసిన పనులలో ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడే పని లేదని ఆరోపించారు.