ఎప్పటికైనా అమెరికా అధ్యక్షురాలు నా కూతురే : ఇవానా ట్రంప్

SMTV Desk 2017-10-14 19:01:11  amerika president, trump, ivana trump, ivanka trump upcoming president.

వాషింగ్టన్, అక్టోబర్ 14 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు ఇవాంకా ట్రంప్ ఎప్పటికైనా ఆ దేశ అధ్యక్షురాలు అవుతుందన్నారు. ట్రంప్ మొదటి భార్యను కాబట్టి ప్రథమ మహిళను కూడా నేనంటూ ఇవానా మరోసారి వార్తల్లో నిలిచారు. కేవలం ట్రంప్ తో విడాకులు మాత్రమే తీసుకున్నా.. కాని, మేమిద్దరం ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటున్నామన్నారు. కాగా అమెరికా ప్రథమ మహిళ ఎవరన్న విషయంపై ట్రంప్ మాజీ భార్య ఇవానా, ప్రస్తుత భార్య మేలానియాల మధ్య అంతర్యుద్ధం జరుగుతున్న విషయం విదితమే.