రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో “చి.ల.సౌ.”

SMTV Desk 2017-10-11 15:22:24  chi.la.sow., movie, hero rahul ravindran, sushanth.

హైదరాబాద్, అక్టోబర్ 11 : ప్రస్తుతం సినీ పరిశ్రమలో నటులు.. దర్శకులుగా, గాయకులుగా, నిర్మాతలుగా మారుతున్నారు. ఇప్పుడు అదే కోవలో అందాల రాక్షసి, అలా ఎలా, శ్రీమంతుడు, టైగర్ లాంటి చిత్రాల్లో నటుడిగా ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్.. దర్శకుడిగా మారి అక్కినేని వారసుడు సుశాంత్ హీరోగా, రూహణి తొలి పరిచయ కథానాయికగా “చి.ల.సౌ.” అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి బుధవారం అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్ర టైటిల్ లోగోలోను ఆవిష్కరించారు. వివాహ వేదిక మీద ఉన్న చి.ల.సౌ. అనే అక్షరాలను దేవతలు ఆశీర్వదిస్తున్నట్టుగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోందని చిత్ర బృందం పేర్కొంది. భరత్ కుమార్ మలసాల, హరి పులిజలలు సంయుక్తంగా సిరుని సినిమా కార్పొరేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ విహారి స్వరాలూ అందించనున్నారు.