శ్రుతిహాసన్ ను మేకప్‌ లేకుండా చూస్తే పారిపోతారు : కన్నడ నటుడు

SMTV Desk 2017-10-10 00:08:14  shruti hasan, kannada actor, jaggesh, comments on shruti hasan

చెన్నై అక్టోబర్ 10: ధృవ సార్జా హీరోగా నటించనున్న కన్నడ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నటి శృతిహాసన్ తాను కన్నడ చిత్రంలో నటించడం లేదని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా స్పష్టం చేశారు. దీంతో అక్కడి కన్నడ సినీ అభిమానులు మీరు మాకు అవసరం లేదు అంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల్లో శ్రుతిహాసన్‌పై విమర్శలు చేస్తున్నారు. అలాగే నటుడు జగ్గూష్‌ శృతిహసన్ పై... ‘నటి శృతిహాసన్ అసలు అందగత్తే కాదు. ఆమెను మేకప్‌ లేకుండా చూస్తే పారిపోతారు. ఆమె కంటే అందగత్తెలు కర్ణాటకలోని కళాశాలల్లో చాలా మంది ఉన్నారని, అందువల్ల నిర్మాతలు తన ఇంటి వాకిలిలో నిలబడి బిచ్చమెత్తాల్సిన అవసరం లేదు’ అంటూ విరుచుకుపడ్డారు. ఎలాంటి ప్రమేయం లేకుండా కన్నడ నటుడు జగ్గేష్‌ నటి శృతిహాసన్ విమర్శలు చేయడం వివాదాస్పదంగా మారింది. తాను కన్నడ చిత్రంలో నటించడం లేదని శృతిహాసన్ క్లారిటీ ఇవ్వడం కూడా తప్పా? దీనికే ఇంతగా దిగజారి విమర్శిస్తారా? అంటూ తమిళ సినీ అభిమానులు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు.