ప్రముఖ టీవీ యాంకర్ కన్నుమూత

SMTV Desk 2017-10-09 16:33:13  Anchor mallika, actress mallika, tv anchor mallika, latest updates,

హైదరాబాద్, అక్టోబర్ 9: బుల్లి తెర వ్యాఖ్యత, సినీ నటి మల్లిక తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు బెంగుళూర్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. మల్లిక అసలు పేరు అభినవ. ఆమె వివాహానంతరం నటనకు దూరమయ్యారు. అంతకు ముందు 1997-2004 మధ్య కాలంలో పలు భాషలలో ప్రసారమైన పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఉత్తమ వ్యాఖ్యాతగా అవార్డులను సైతం అందుకున్నారు. అంతేకాకుండా బుల్లితెరపై సీరియల్స్ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సాధించింది. ఆమె మరణం పట్ల పలువురు సినీ, టీవీ నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు. మల్లిక అంత్యక్రియలు రేపు హైదరాబాద్ లో జరగనున్నాయి.