లాస్‌వెగాస్‌ వద్ద కాల్పులు దృశ్యాలు విడుదల

SMTV Desk 2017-10-04 15:48:39  Las Vegas, Video, Police

వాషింగ్టన్, అక్టోబర్ 04 : లాస్‌వెగస్‌ నరమేధానికి సంబంధించి ఒక వీడియోను పోలీసులు విడుదల చేశారు. దుండగుడు కాల్పులు జరిపిన సమయంలో ఓ పోలీసు అధికారి శరీరానికి ఉన్న ఒక కెమెరా అక్కడ నెలకొన్న గీతవాహ పరిస్థితులను రికార్డు చేసింది. మ్యాండలే బే హోటల్‌లోని 32వ అంతస్తు నుంచి ప్యాడాక్‌ సంగీత కచేరీ లక్ష్యంగా కాల్పులకు తేగాపడగ భయంతో ప్రజలు పరుగులు తెస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. కాల్పుల శబ్దాలను కూడా ఇందులో స్పష్టంగా వినొచ్చు. పోలీసులు హంతకుని వెత్తుకుతున్న సమయంలో ఈ వీడియోని చిత్రీకరించారు. ఈ దుర్ఘటనలో మొత్తం 59 మంది ప్రాణాలు కోల్పోగా, 525 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉండగా హంతకుడు స్టీఫెన్‌ ప్యాడాక్‌ ఎందుకు కాల్పులు జరిపాడో పోలీసులకి ఇంకా అంతు పట్టడం లేదు.