డిసెంబర్ లో ప్రభాస్, అనుష్కల పెళ్లి : ఉమైర్ సంధు

SMTV Desk 2017-10-03 21:34:19  prabhas, anushka, marriage, umair sandhu, engagement

హైదరాబాద్ అక్టోబర్ 03: హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యం లో ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు వీరిద్దరీ పెళ్లి గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ, వారిద్దరూ డిసెంబర్ లో ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నారని, అలాగే ప్రస్తుతం వాళ్లిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. ‘ప్రభాస్, అనుష్కల క్లోజ్ ఫ్రెండ్ తనకు చెప్పాడని... వీరిద్దరికీ ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమ ఉందని, ఒకరి పట్ల మరొకరు చాలా కేర్ తీసుకుంటారని’ మరొక పోస్ట్ లో పేర్కొన్నాడు. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలుసుకోవాలంటే ప్రభాస్, అనుష్కల పెళ్లి జరిగే వరకు(విడిగా లేదా కలిసి పెళ్లి చేసుకుంటారో?) వేచి చూడాల్సిందే, అప్పటి వరకు ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి.