‘క్రిష్ 4’ చిత్రం రాబోతుంది

SMTV Desk 2017-09-27 08:26:44  krrish, hrik roshan, krrrish 4, rakesh roshan double role

ముంబయి సెప్టెంబర్ 27: హృతిక్‌ రోషన్ ‘క్రిష్’ సినిమాలతో ఇండియన్ సూపర్ మాన్ గా పేరు సంపాదించారు. ఈ సిరీస్ లో ‘క్రిష్ 2’ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇపుడు ‘క్రిష్ 4’ చిత్రం రాబోతుంది. ఈ సినిమాకు కూడా ‘రాకేశ్ రోషన్’ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమాలో హృతిక్‌ హీరోగానే కాదు విలన్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇంతకూ ముందు క్రిష్ సిరీస్ లో వచ్చిన చిత్రాలలో హృతిక్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఇపుడు కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారనుకుంట. వచ్చే సంవత్సరం ఈ సినిమా చిత్రీకరణ మొదలవనుంది. 2018 సంవత్సరం చివరలో క్రిస్మస్‌కు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం హృతిక్‌ ‘సూపర్‌ 30’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయిక ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు, మళ్ళీ ప్రియాంక చోప్రా నే తీసుకుంటారో లేదో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే. ఈ చిత్రాన్ని కూడా సొంత ప్రొడక్షన్ కంపెనిలోనే తెరకెక్కించనున్నారు.