జర్మనీ ఎన్నికల్లో విజయానికి చేరువలో మెర్కెల్

SMTV Desk 2017-09-25 15:09:42  jarmani, Chancellor Angela Merkel, elections

జర్మనీ, సెప్టెంబర్ 25 : జర్మనీలో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. నాలుగోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమైన ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, ఈసారి ఆమెనే విజయం వరిస్తుందని పలు సర్వేలు అభిప్రాయపడుతున్నాయి. మెర్కెల్ నేతృత్వంలోని క్రిష్టియన్ డెమోక్రాటిక్ యునియన్ కు సోషల్ డెమోక్రాటిక్ పార్టీ గట్టి పోటీ ఇస్తుంది. ఈ ఎన్నికల్లో ఈ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవచ్చునని సర్వేలు వెల్లడించాయి.