‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా కథ నాది : రచయిత్రి శ్యామలారాణి

SMTV Desk 2017-09-16 23:33:41  mister perfect, shyamalarani, prabhas, darling, dil raju

హైదరాబాద్ సెప్టెంబర్ 16: వరుస అపజయాలతో ఉన్న ప్రభాస్ కి మంచి హిట్ ఇచ్చిన చిత్రం డార్లింగ్, ఆ వెంటనే తీసిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా ప్రభాస్ ని మళ్ళి సక్సెస్ ట్రాక్ లో పడేసింది. అయితే ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రకథ తన నవల లోని కథను కాపీ కొట్టి తీసారని ‘నా మనస్సు నిన్ను కోరె’ నవల రచయిత్రి శ్యామలారాణి పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో కొందరు కథలను కాపీ కొట్టి తీస్తుంటారు, అయితే అందులో కొన్ని హిట్ అవుతుంటాయి కొన్ని ఫెయిల్ అవుతాయి. కానీ ఆ సినిమా హిట్ అయితే మాత్రం ఆ కథ నాది అంటూ చాలా మంది వస్తుంటారు. అలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. ఈ మధ్య కాలంలో ‘అర్జున్ రెడ్డి’ కథ నాది అని ఒకరు మీడియా ముందుకు వచ్చారు. ఇపుడు ‘నా మనస్సు నిన్ను కోరె’ అనే తన నవలను మక్కీకి మక్కీగా దించేసి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తీసేశారని ఆ సినిమా నిర్మాత దిల్ రాజుపై హైద‌రాబాద్‌లోని మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు శ్యామలారాణి చేశారు. దీంతో పోలీసులు స‌ద‌రు నిర్మాతపై కాపీ రైట్స్ చ‌ట్టాల‌ కింద కేసులు నమోదు చేసి, ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. ధశరథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ స‌ర‌స‌న‌ కాజల్‌, తాప్సీ న‌టించారు. ఆ సంవత్సరం తెలుగులో బిగ్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది.