అమెరికాకు మేము ఏమాత్రం తీసిపోము

SMTV Desk 2017-09-16 11:27:59  North korea president, Kim Jong-un, Missile experiment, Amerika

ఉత్తరకొరియా, సెప్టెంబర్ 16 : నిత్యం ఏదో దురాలోచనలు చేసే ఉత్తరకొరియా, ఎన్ని ఆంక్షలు విధించినా అణు కార్యక్రమం మాత్రం ఆగదని అగ్ర దేశాలను హెచ్చరిస్తోంది. ఉత్తరకొరియా ప్రధాని కిమ్ జంగ్ ఉన్ మాట్లాడుతూ.. "సైనిక శక్తిలో అమెరికాతో మేము ఏమాత్రం తీసిపోమని నిరూపించేందుకే, ఈ క్షిపణి ప్రయోగం చేశామని స్పష్టం చేశారు. ఈ ప్రయోగంతో ఉత్తరకొరియా విషయంలో అమెరికా "సైనిక చర్య" అనే మాట అనేందుకే భయపడుతుందని" అన్నారు. ఈ నేపధ్యంలో హ్వసాంగ్‌-12 క్షిపణి పరీక్షను కిమ్‌ జాంగ్ స్వయంగా పరిశీలించారు. అంతేకాకుండా దేశానికి సంబంధించిన అణు అవసరాలను పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేసినట్లు సమాచారం. అయితే తాజాగా జరిపిన క్షిపణి పరీక్షలతో ఉత్తరకొరియా మరింత శక్తివంతంగా మారిందని వెల్లడించారు.