లండన్ రైల్వే స్టేషన్ లో బాంబు పేలుడు....

SMTV Desk 2017-09-15 16:30:55  london, parsons green tub station, tub station,

లండన్, సెప్టెంబర్ 15: లండన్ లో బాంబు పేలుడు పెను విధ్వంసం సృష్టించింది. లండన్ లోని పార్సన్స్ గ్రీన్ ట్యూబ్ స్టేషన్ లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన భద్రత దళాలు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతమంతా క్షతగాత్రుల ఆర్తనాదాలతో మారుమ్రోగింది. అదే ప్రాంతంలో రెండో బాంబును గుర్తించిన బాంబ్ స్క్వాడ్, నిర్వీర్యం చేశారని తెలిపారు. ఈ పేలుడు కారణంగా అప్రమత్తమైన పోలీసులు ముందు జాగ్రత్తలో భాగంగా మెట్రో రైలు సర్వీసులను నిలిపి వేశారు. ఈ సంఘటనను ఉగ్రవాద చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.