ఎన్టీఆర్ సినిమాకి 8 ఏళ్ల తర్వాత సీక్వెల్

SMTV Desk 2017-09-13 16:44:42  v.v vinayak, adhurs, adhurs sequel, jr.ntr

హైదరాబాద్, సెప్టెంబర్ 13: వినాయక్ దర్శకత్వం వహించిన చిత్రాలలో ‘అదుర్స్’ సినిమా ఒక మైలురాయి. ఈ సినిమా వినాయక్ కు మంచి పేరుతో పాటు పలు అవార్డులను తెచ్చి పెట్టింది. అయితే ఇప్పుడు వినాయక్ ఈ మూవీకి సీక్వెల్ చేయాలనే ఆలోచనతో ఓ మంచి కథ సిద్దం చేయమని కోన వెంకట్ కి చెప్పారట. కోన కూడా అదేపనిలో నిమగ్నమయ్యారట. కానీ ఈ సీక్వెల్ పై ఎన్టీఆర్ అప్పట్లో ఆసక్తి కనబరిచినా, ఇప్పుడు చేస్తాడో లేదో అని సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఎందుకంటే తారక్ ప్రస్తుతం విభిన్న అవతారాలలో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ మూవీ గురించి అడిగితే “మళ్లి అదుర్స్ సిక్వేలా ..?” అంటాడేమో..చూడాలి మరి...