రూ. 11 కోట్లకి పైగా వసూలు చేసిన హాలీవుడ్ సినిమా

SMTV Desk 2017-09-12 21:19:36  it movie, it, it hollywood movie, warner bros, horror film

హైదరాబాద్ సెప్టెంబర్ 12: హాలీవుడ్ సినిమాలకు మన దేశంలో బాగా మార్కెట్ ఉంది, ఇండియాలో బాగా ఆడిన సినిమాల్లో ‘అవతార్’ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ మధ్య కాలంలో ‘ది జంగల్ బుక్’ చిత్రం బాగా కలెక్షన్ లు రాబట్టింది. తాజా గా ‘ఇట్’ అనే ఓ హారర్ చిత్రం కూడా భారతదేశ మార్కెట్లో కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 11 కోట్లకి పైగా వసూలు చేసినట్లు తెలుస్తుంది. దీనిపై వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ఇండియా డెంజిల్ డ‌యాస్ ఆనందం వ్య‌క్తం చేశారు. అమెరికాలో ఈ సినిమా రికార్డుల‌ను కొల్లగొడుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 117.2 మిలియ‌న్ డాల‌ర్ల‌ను వ‌సూలు చేసిన‌ట్లు స‌మాచారం. హారర్ చిత్రాల్లో ఇంత భారి కలెక్షన్ లను సాధించిన మొదటి చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రానికి ఆండీ ముషేట్ దర్శకుడు గా పనిచేసారు.