హైదరాబాద్ సెప్టెంబర్ 12: ‘ఫ్యానీ ఖాన్’ చిత్రం లో ఐశ్వర్య రాయ్ నటిస్తోంది, ఇందులో అనిల్ కపూర్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. కోలీవుడ్ నటుడు మాధవన్ ఐశ్వర్య రాయ్ కి జోడిగా నటించే అవకాశాన్ని వదులుకున్నారు. ఈ చిత్రం లో ఐశ్వర్య భర్త పాత్ర కు మాధవన్ ని సెలెక్ట్ చేసారు, అయితే చివరి నిముషం లో ఈ అవకాశాన్ని వదులుకున్నారు. మాధవన్ బారి పారితోషకం డిమాండ్ చేయడం తో చిత్రబృండం అంత ఇవ్వడానికి సిద్దంగా లేక పోవడంతో చిత్రం నుండి తప్పుకున్నారు. ఈ పాత్రకు మాధవన్ 1.5 కోట్లు డిమాండ్ చేశారట. కాని ఆయనతో కేవలం పది రోజుల చిత్రీకరణ మాత్రమే చేయాల్సి ఉండటం తో చిత్ర యూనిట్ అంత పారితోషికానికి ఒప్పుకోలేదు. ఆ తరువాత అతని స్థానంలో రాజ్‌కుమార్ రావ్‌ను ఎంపికచేసుకున్నారు. ఈ చిత్రానికి రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్ చిత్రం ‘ఎవ్రీబడీస్ ఫేమస్’ చిత్రానికి ఇది రీమేక్‌గా రాబోతోంది.