ప్రపంచంలోనే అతిపొడవైన గోర్లు

SMTV Desk 2017-09-12 17:09:06  Longest Nails, Guinness World Records, Ayanna Williams, Nail polish

టెక్సాస్‌, సెప్టెంబర్ 12: ప్రపంచంలోనే అతిపొడవైన చేతి గోర్లతో టెక్సాస్‌లోని హ్యూస్ట‌న్‌ ప్రాంతానికి చెందిన అయానా విలియ‌మ్స్ సరికొత్త గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. గ‌త 23 ఏళ్లుగా చేతి గోర్ల‌ను పెంచుతున్న ఆమె రెండు చేతి వేళ్ల గోర్ల పొడవు 18 అడుగుల వ‌ర‌కు ఉండటం గమనార్హం. ఆమె ఎడ‌మ బొట‌న వేలి గోరు పొడ‌వు, ప్ర‌పంచంలోనే త‌క్కువ ఎత్తు ఉన్న చంద్ర బ‌హ‌దూర్ కంటే పొడ‌వు ఉంది. చంద్ర బ‌హ‌దూర్ ఎత్తు 1 అడుగు 9.5 అంగుళాలు. అయానా గోరు పొడ‌వు 2 అడుగుల 2.7 అంగుళాలు. గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న అనంతరం అయానా మాట్లాడుతూ... నా గోర్లు నా శ‌రీరంలో భాగం. అందుకే వాటిని క‌త్తిరించాల‌ని నేను అనుకులేదు అని స్పష్టం చేసింది. నెయిల్ ఆర్టిస్ట్‌గా ప‌నిచేస్తున్న అయానా త‌న గోర్ల‌కు పాలిష్ చేసి, పెయింట్ వేయ‌డానికి దాదాపు 20 గంట‌ల సమ‌యం, రెండు బాటిళ్ల నెయిల్ పాలిష్ అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని వెల్లడించింది. ఈ రికార్డుకు సంబంధించిన వీడియోను గిన్నిస్ బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.