నచ్చినవాడు కనపడలేదంటున్న నటి అంజలి

SMTV Desk 2017-09-10 16:22:10   Rumars about Actress Anjali and Hero Jai

హైదరాబాద్, సెప్టెంబర్ 10 : తనకి నచ్చినవాడు ఇంకా దొరకలేదని ప్రముఖ నటి అంజలి అంటో౦ది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో కెరీయర్ ఉపందుకున్న అంజలి ఆ తర్వాత వెంకటేశ్, బాలకృష్ణ వంటి ప్రముఖ హీరోలతో జత కట్టినా ఆమె స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని మాత్రం సొంతం చేసుకోలేకపోయారు. కోలీవుడ్ లో కూడా ఇదే పరిస్థితి. అయితే అవకాశాలను మాత్రం ఈ రెండు భాషల్లోనూ వరుసగా అందుకుంటూనే ఉంది. ప్రస్తుతం మలయాళంలోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకునే ప్రయత్నంలో ఉంది. అంజలి, జై కలిసి నటించిన బెలూన్‌ తమిళ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. నటుడు జైతో ప్రేమ, షికార్లు అంటూ ప్రచారం జోరుగానే జరుగుతోంది. ఆ మధ్య జై తన స్వహస్తాలతో దోసెలు వేసిపెడితే లొట్టలేసుకుని తిని ఆయనలో మంచి నలభీముడున్నాడంటూ కితాబిచ్చేసింది కూడా. అంతే కాదు జై పుట్టిన రోజు వేడుకల్లో ప్రత్యేకంగా పాల్గొని సందడి చేసింది. దీంతో ఈ జంట గురించి చాలా గాసిప్స్‌ హల్‌చల్‌ చేశాయి. ఇక నటుడు జై కూడా తాను నటి అంజలిని పెళ్లి చేసుకుంటానని అన్నట్లు ప్రచారం జరిగింది. ఇంత జరుగుతున్నా తాజాగా నటి అంజలి తనకు నచ్చినోడు ఇంకా తారసపడలేదని అనడం చర్చనీయాంశంగా మారింది.