మయాన్మార్ స్టేట్ కౌన్సిలర్‌ అంగ్ సాంగ్ సూకీ తో మోదీ భేటీ

SMTV Desk 2017-09-06 15:30:10  Myanmar State Councilor Ang San Quinti, india presindent modi, meeting

నేపిడా, సెప్టెంబర్ 06 : మైత్రి బలోపేతం చేయడమే లక్ష్యంగా మయన్మార్ పర్యటీస్తున్న భారత ప్రధాని మోదీ ఆ దేశ స్టేట్ కౌన్సిలర్‌ అంగ్ సాంగ్ సూకీ తో సమావేశయ్యారు. భద్రత ఉగ్రవాదంపై పోరు వాణిజ్యం పెట్టుబడులు, మౌలిక వసతులు, ఇంధనం, సంస్కృతి వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించడమే లక్ష్యంగా చర్చలు జరిపారు. రోహింగ్యా ముస్లీంలు అధికంగా నివసించే రాకింగ్ రాష్ట్రంలో హింస చెలరేగిన పరిస్థితుల్లో మయన్మార్ వెళ్లిన మోదీ పొరుగు దేశాలకు రోహింగ్యాల వలస అంశాన్ని ఆమెతో చర్చల్లో ప్రస్తావించినట్లు తెలుస్తుంది. బ్రిక్స్ సదస్సు ముగిసాక మంగళవారం చైనా నుంచి మయన్మార్ రాజధాని నేపిడా నేరుకున్న ప్రధాని తొలి రోజు ఆ దేశాధ్యక్షుడు టిన్ గ్యాతో సమావేశమయ్యారు. భారత్ మయన్మార్ చారిత్రక బంధాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. 2014 నవంబర్ లో ఆసియాన్‌ శిఖరాగ్ర సదస్సు కోసం మోదీ నేపిడా వెళ్లిన మయన్మార్ కు ద్వైపాక్షిక పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.