40నిమిషాల పుటేజీని కలుపనున్న అర్జున్ రెడ్డి టీం

SMTV Desk 2017-09-05 13:23:50  arjunreddy, aditional scenes, vijay devarakonda, shalini, extra scenes,

హైదరాబాద్ సెప్టెంబర్ 5 : తిరుగులేని సినిమాగా దూసుకుపోతోంది అర్జున్ రెడ్డి చిత్రం. కలెక్షన్స్ సునామీల వచ్చి పడుతున్నాయి. కే టి ఆర్ నుంచి రాజమౌళి వరకు అందరు ఈ సినిమాను అభినందించారు. తాజా గ అరవిందస్వామి కూడా సినిమాని చూసి పొగిడారు. ఒరిజనల్, డీప్, కల్ట్ సినిమాగా ఈ చిత్రం గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక విషయం హల్చల్ చేస్తుంది. ఏంటంటే ఎడిట్ చేసిన 40నిమిషాల సన్నివేశాలని సినిమాకు యాడ్ చేయాలని డైరెక్టర్ సందీప్‌రెడ్డి భావిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా 3గంటల నిడివితో నడుస్తోంది. ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తమ చిత్ర యూనిట్ 40నిమిషాల పుటేజీని ఎడిటింగ్ టేబుల్ వద్ద త్యాగం చేసిందని.. కానీ సినిమాకు ప్రతి షాట్ చాలా ఇంపార్టెంట్ అన్నారు. అయితే ఇప్పుడు తనకు ఎడిట్ చేసిందాన్ని కలపాలని ఉందని.. ఎందుకంటే ఆ ఫుటేజ్ మూవీకి కలపడం వాళ్ళ మరింత ఫీల్ వస్తుందని అన్నారు. ఇప్పటికే ఎంతో చేసిన ఈ సినిమా, పొడగించిన తరువాత ఇంకెంత రచ్చ చేయనుందో!