సాయి ధరమ్ తేజ్ తో వినాయక్ చిత్రం

SMTV Desk 2017-09-05 12:48:10  saidharmtej, vv vinayak, jawaan, double roles, nakshatram

స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్ తన చిత్రాలలో ద్విపాత్రాభినయం ట్రెండ్ ని బాగా ఫాలో అవుతున్నారు. చెన్నకేశవరెడ్డి, అదుర్స్, నాయక్, అల్లుడు శీను మరియు తాజాగా వచ్చిన ఖైది నం. 150 చిత్రాలలో హీరోలందరు ద్విపాత్రాభినయమే చేసారు. ఇపుడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో ఓ సినిమా చేయబోతున్నారు, అయితే ఈ చిత్రంలో కూడా సాయి ధరమ్ తేజ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడట. కాకపోతే డబుల్ రోల్స్ లో వచ్చిన అన్ని చిత్రాలు హిట్ అవడంతో ఈ సెంటిమెంట్ ను అలాగే కొనసాగిస్తున్నారు. మెగా ఇమేజ్ ను పర్ఫెక్ట్ గా సరిగ్గా వాడుకుంటూ వరుస విజయాలతో ఉన్న సాయి ధరమ్ తేజ్ కు ఈ మధ్య సరిగా కలిసి రాలేదనే చెప్పాలి, ముఖ్యంగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నక్షత్రం సినిమా ధరమ్ తేజ్ ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేసింది. ప్రస్తుతం రచయిత, దర్శకుడు బీవీయస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నాడు సాయిధరమ్ తేజ్.