తమన్నా పాకిస్థాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ని పెళ్ళాడబోతుందా..?

SMTV Desk 2017-09-05 12:02:58  tamanna, abdul razak, tamanna marrige, rumors

హైదరాబాద్ సెప్టెంబర్ 5 : తమన్నా గతంలో ఓ ఇంజనీర్ ని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు రాగా, నా జీవితంలోకి ఎవరైన అడుగు పెడితే నేనే మొదట మీ అందరికి చెబుతాను అని స్పష్టం చేసింది మిల్క్ బ్యూటీ తమన్నా. అయితే సడెన్ గా ఇంకో రూమర్ పుట్టుకొచ్చింది, ఏంటంటే తమన్నా పాకిస్థాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ని పెళ్ళాడబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త‌మ‌న్నా, అబ్ధుల్ రజాక్ ఇద్దరు కలిసి నగదు దుకాణంలో కలిసి ఉన్న ఫోటో నెటిజన్ల కంట పడింది. ఇక అంతే తన ప్రియుడితో కలిసి పెళ్ళి షాపింగ్ చేస్తుందని జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ఫోటో వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే ఈ ఫోటో 2013 సంవత్సరంది కాగా, అప్పట్లో దుబాయ్ లోని ఓ షాప్ ఓపెనింగ్ కి తమన్నా, రజాక్ వెళ్ళారు. అప్పుడు క్లిక్ చేసిందే ఈ ఫోటో. ఇప్పుడు ఈ పిక్ ని వైరల్ గా మార్చి తమన్నా పెళ్లి పీటలెక్కనుందని రూమర్స్ పుట్టించారు. బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గుర్తింపును సైతం సొంతం చేసుకుంది. అయితే తమన్నా జై లవకుశ సినిమాలో ఓ ఐటం సాంగ్ చేయనున్నట్లు సమాచారం.