పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేనంత శత్రుత్వం మా మధ్య లేదు: మహేష్ కత్తి

SMTV Desk 2017-09-02 15:30:24  

హైదరాబాద్ సెప్టెంబర్ 2: ఈ మధ్య సోషల్ మీడియాలో మహేష్ కత్తి కి పవన్ ఫ్యాన్స్ కి జరిగిన వివాదం అంత ఇంత కాదు. తనకు పవన్ ఫ్యాన్స్ నిద్ర కూడా లేకుండా చేస్తున్నారని, తనపై తీవ్ర మైన పదజాలం వాడారని ఇంటర్వ్యూలో మహేష్ కత్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకా వారు తనకు క్షమాపణలు చెప్పాలని ఇటీవల డిమాండ్ కూడా చేసారు. అయితే, ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకుల సందర్బంగా మహేష్ కత్తి ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పాడు. ఇప్పటికి అయిన పవన్ ఫాన్స్ తమ తీరుని మార్చుకోవాలని సూచించాడు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ "మరీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేనంత శత్రుత్వం నాకు ఎందుకుంటుంది!" అని పేర్కొన్నాడు.