సరిగ్గా పుట్టినరోజు నాడే మరణించిన బాలిక

SMTV Desk 2019-10-17 15:07:12  

అబుధాబీలో కేరళ రాష్ట్రానికి చెందిన 12 ఏళ్ల భారతీయ బాలిక సరిగ్గా ఆమె పుట్టినరోజున మృతిచెందింది. మహిమా సుసాన్ షాజీ అనే బాలిక గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సరిగ్గా ఆమె బర్త్‌డే అయిన మంగళవారం(అక్టోబర్ 15) నాడు కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

12 ఏళ్ల మహిమా అబుధాబీ ఇండియన్ స్కూల్‌లో చదువుతుంది. ఆమె తండ్రి షాజీ చాకో డేనియల్ గత 20 ఏళ్లుగా అబుధాబీలోనే పనిచేస్తున్నారు. ఆమె సోదరి మాత్రం ఇండియాలో చదువుతోంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిమా మంగళవారం అల్ ఐన్‌లోని తవామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీంతో మృతదేహం పాడవకుండా ఉండేందుకు షేక్ ఖలీఫా మెడికల్ సిటీలో ఎంబామింగ్ ప్రక్రియ నిర్వహించి స్వదేశానికి తరలించారు. శనివారం ఆమె స్వస్థలం కేరళలోని కొల్లం జిల్లా కొట్టారక్కర‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.