ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం

SMTV Desk 2019-10-01 15:08:15  

ఇస్లామాబాద్/న్యూ యార్క్: అమెరికా పర్యటన ముగించుకున్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధిగా ఉన్న మలీహా లోధిని ఆ స్థానంలో కొనసాగ రాదని ప్రకటించారు.ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్, కశ్మీర్ అంశాన్ని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకు వెళ్లడంలో విఫలమవడానికి భాద్యత లోధీ వహించాలంటూ ఇమ్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఐక్యరాజ్య సమితి సర్వసభ్య దేశాల సమావేశంలో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ యుద్ధోన్మాదంతో భారత్ పై విషం కక్కిన విషయం తెలిసిందే.ఈ అంశంలో ఇమ్రాన్ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.అది విఫలమవడంతో ఇమ్రాన్ ఖాన్ కు తన స్వదేశంలోనూ,బయట ప్రపంచంలో చెడ్డ పేరు వచ్చింది.ఆ తప్పుకి పాకిస్థాన్ ప్రతినిధి మహీలా లోధీదే భాద్యత అంటూ ఆమెను ఆ స్థానం నుండి తప్పించారు.ఆ స్థానంలో ఇమ్రాన్ మునీర్ అక్రమ్ ను నియమించారు. అయితే గతంలో మునీర్ అమెరికాలో పాక్ ప్రతినిధిగా వ్యవహరించారు.అప్పుడు గృహ హింస కేసులో ఆయన ఆ పదవిని వదులుకోవలసి వచ్చింది.