వాళ్లకి మద్దతు ఇవ్వడం ఆపేసే వరకు క్రికెట్ ఆడేది లేదు : జైశంకర్

SMTV Desk 2019-09-26 17:58:14  

న్యూ యార్క్: ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం ఆపేసే వరకు పాకిస్థాన్ తో క్రికెట్‌ ఆడబోమని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ చెప్పారు. న్యూఢిల్లి, ఇస్లామాబాద్‌ మధ్య ప్రధానంగా సాగుతున్న అంశం ఉగ్రవాదం, ఆత్మాహుతి దాడులు, హింసాకాండ అని ఆయన అన్నారు. ఇలాంటివి చేస్తూ మధ్యలో సరే.. టీ బ్రేక్‌ తీసుకుందాం, క్రికెట్‌ ఆడుకుందాం అంటే సరిపోతుందా? అని ఆయన ప్రశ్నించారు.