కోతిలా ఉన్నడంటూ దుమారం రేపుతున్న నెటిజన్లు

SMTV Desk 2019-09-26 17:57:47  

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖం,హావభావాలపై ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా దుమారం రేగింది. నెటిజన్లలో చాలా మంది ఎవరికి తోచినట్లు వారు గ్రాఫిక్స్ చేసి మరీ ట్రంప్‌ పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రకరకాల జంతువుల్ని ట్రంప్‌నీ పోల్చి వీడియోలు పెట్టారు. వీటన్నిటిలోకి ఇప్పుడు ట్రంప్ వర్సెస్ మంకీ అన్నది నెటిజన్లు ఎక్కువగా వైరల్ అవుతోంది. తాజాగా హౌడీ మోదీ సభ జరిగిన సందర్భంగా... ప్రధాని మోదీని మెచ్చుకుంటున్నారు గానీ... ట్రంప్‌పై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మోదీ కోతి లాగా ఉన్నారని ఇదివరకు ఎంతో మంది రకరకాల కోతుల ముఖాలను పోస్ట్ చేశారు. తాజాగా మరో నెటిజన్ కూడా... ఓ భారీ మంకీని చూపిస్తూ... "నేను ట్రంప్ లా ఉన్నానా" అని అది ప్రశ్నిస్తున్నట్లు కామెంట్ పెట్టారు.