బాలిస్టిక్ మిస్సైల్ ను ప్రయోగించిన పాక్...యుద్దానికేనా?

SMTV Desk 2019-08-30 12:47:58  

పాకిస్తాన్ గురువారం బాలిస్టిక్ మిస్సైల్ ను ప్రయోగించింది. ఈ క్షిపణి పరీక్ష కోసం పాక్ తన గగనతలాన్ని మూసివేసింది. గజిని మిస్సైల్ పరీక్షతో పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. పాక్ ప్రయోగించిన గజిని మిస్సైల్ కు అణ్వాయుధాలను తీసుకెళ్లే సామర్థం ఉంది. గజని బాలిస్టిక్‌ మిస్సైల్‌ను ప్రయోగించినట్టు ఐఎస్‌పీఆర్ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్‌ మేజ‌ర్ జ‌న‌ర‌ల్ అసిఫ్ గ‌ఫూర్ మీడియాకు తెలిపారు. గజని క్షిప‌ణి 290 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు ప‌లు ర‌కాల వార్‌హెడ్స్‌ను మోసుకెళ్ల‌గ‌ల‌దని ఆయన పేర్కొన్నారు. గజని మిస్సైల్ ప‌రీక్ష విజ‌య‌వంత‌మైందని ఆయన తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్, అధ్య‌క్షుడు సైంటిస్టులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.