"అర్జున్ రెడ్డి" కథ కాపీనా?

SMTV Desk 2017-08-30 17:09:50  ARJUN REDDY, COPY MOVIE, DIRECTER SANDEEP REDDY, NOTICE.

హైదరాబాద్, ఆగస్ట్ 30 : ఇప్పటికే ఎన్నో వివాదాలను ఎదుర్కొని విడుదలైన "అర్జున్ రెడ్డి" సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. కాని ఈ సినిమాలో కొన్ని అసభ్యకరమైన సన్నివేశాలున్నాయంటూ, వెంటనే వాటిని నిషేధించాలని పలువురు డిమాండ్ చేస్తున్న తరుణంలో మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా కథ తనదేనంటూ ఖమ్మంకు చెందిన ఓ వ్యక్తి చెబుతుండడం విశేషం. ఓ వైపు ఈ కథను నేను నా వ్యక్తిగత అనుభవాల ద్వారా రాసుకున్నా అని దర్శకుడు సందీప్ రెడ్డి చెబుతున్నా.., ఇలా మరో వ్యక్తి ఈ కథ తనదేనంటూ రావడం చర్చలకు దారీ తీస్తుంది. అసలు విషయం ఏంటంటే.. ఖమ్మంకు చెందిన దర్శకుడు నాగరాజు గతంలో తెరకెక్కించిన "ఇక సె..లవ్" అనే చిత్ర కథనే యథావిధిగా తెరకెక్కించారని ఆరోపిస్తూ దర్శక, నిర్మాతలకు నోటీసులు పంపాడు. ఈ చిత్ర ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని, తన అనుమతి లేకుండా తన కథతో సినిమా తీసినందుకు రూ. 2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని నాగరాజు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అలా ఇవ్వలేని పక్షంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నాడు.