ఘోరం...ట్యాంకర్ పేలి 60 మంది మృతి

SMTV Desk 2019-08-11 15:17:47  

టాంజానియాలో ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ పేలి 60 మంది మృతి చెందారు. ఈ దారుణ ఘటన పూర్తి వివరాల ప్రకారం...ఆయిల్ ట్యాంకర్ నుంచి ప్రజలు పెట్రోల్ తీసుకుంటుడగా పైపు ఒక గొట్టానికి తగలడంతో మంటలు చెలరేగాయి. సమీపంలో 60 మంది సజీవదహనం కాగా మరో 65 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన దారు సే సలేమ్‌కు 200 కిలో మీటర్ల దూరంలో జరిగింది.