లంకకు గిఫ్ట్ గా యుద్ద నౌకను పంపించిన చైనా!

SMTV Desk 2019-07-17 12:26:08  china gives warship to sri lanka, china, srilanka

బీజింగ్: శ్రీలంకకు చైనా ఓ కానుక అందజేసింది. తాజాగా ఓ యుద్ధ నౌకను చైనా బహుమతిగా లంకకు బహుకరించింది. ఈ మేరకు హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా కీలకమైన శ్రీలంకతో చైనా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇదివరకే శ్రీలంకలో ఓ పోర్టును చైనా నిర్మిస్తోంది. అంతేకాకుండా త్వరలో 9 కొత్త రైళ్లను కూడా అందించనున్నట్టు చైనా వెల్లడించింది. ‘పి625’ గా పిలిచే ఈ నౌక గత వారమే కొలంబో చేరింది. శ్రీలంక దీన్ని తీరప్రాంత గస్తీకి, సముద్ర దొంగలపై పోరాటానికి ఉపయోగించే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. యుద్ధ నౌకను తమకు బహుమానంగా ఇచ్చిన చైనాకు శ్రీలంక ధన్యవాదాలు తెలిపింది.