నా ప్రాణాలకు పవన్ కళ్యాణ్.. బండ్ల గణేష్ బాధ్యత వహిస్తారా..? : కత్తి మహేష్

SMTV Desk 2017-08-30 11:20:18  WHO IS THE RESPONSIBLE FOR MY LIFE, KATTI MAHESH, PAWAN KALYAN, BANDLA GANESH,

హైదరాబాద్, ఆగస్ట్ 30 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "కాటమరాయుడు" సినిమాపై గతంలో కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలతో పవన్ ఫాన్స్ ఆగ్రహానికి గురైన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ఫాన్స్ వల్ల తన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని, ఈ మేరకు పోలీస్ స్టేషన్లో తప్పకుండా ఫిర్యాదు చేస్తాన౦టూ కత్తి మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఫాన్స్ ను అర్ధం చేసుకోగలను, వాళ్ళు దేవుడిగా భావించే పవన్ ను ఎవరైనా ఏమైనా అంటే ఫాన్స్ ఆయనను రక్షించే ప్రయత్నం చేస్తారని తెలుసు. కాని వారు హెచ్చరిస్తున్న తీరు చూస్తుంటే చాలా హింసాత్మక ధోరణి కనపడుతోందని ఆవేదనను వ్యక్తం చేసారు. తనను వదిలిపెట్టమని, కొడతామ౦టూ, చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. నిర్మాత బండ్ల గణేష్ కూడా తనను హెచ్చరించారని తెలిపాడు. ఒకవేళ తన వ్యాఖ్యలతో అభిమానులు స్ఫూర్తి పొంది తనను నిజంగానే ఏమైనా చేస్తే ఆ బాధ్యత పవన్ తీసుకుంటారా? లేదా బండ్ల గణేష్ తీసుకుంటారా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు తనకు దాదాపు 10 వేల బెదిరింపు కాల్స్ వచ్చాయని, సమాజంలో విష సంస్కృతి పెంచి పోషించ వద్దని కత్తి మహేష్ కోరారు.