పాక్ మీదగా కాకుండా ఒమెన్‌ మార్గం గుండా మోడీ ప్రయాణం

SMTV Desk 2019-06-12 18:29:57  modi travells omen route

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్‌సిఓ సదస్సుకు పాక్ గగనతలం మీదుగా వెళ్లనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి పాక్ అనుమతి కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు పాక్ మీదగా కాకుండా ఒమెన్‌ మార్గం గుండా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారం మోది వివిఐపి విమానంలో ఒమెన్‌, ఇరాన్‌, సెంట్రల్‌ ఆసియా దేశాల గుండా బిష్కెక్‌ చేరుకుంటారు. ప్రధాని తన పర్యటన మార్గం విషయంలో తీసుకున్న తాజా నిర్ణయాన్ని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి.