పెంగ్విన్‌లకు శాపంగా మారిన కికియూ గడ్డి

SMTV Desk 2019-06-12 18:23:23  kikuyu grass effects on penguins

విక్టోరియా: ఆస్ట్రేలియాలోని పెంగ్విన్‌లకు కికియూ అనే గడ్డి శాపంగా మారుతోంది. దీంతో కొన్ని వేల పెంగ్విన్ లు ప్రాణాలు కోల్పోతున్నాయి. వివరాల ప్రకారం...1992లో విక్టోరి యా ప్రాంతంలో విమానం లాండింగ్‌ సౌకర్యం కోసం కికియూ అనే గడ్డిని తీసుకువచ్చి నాటారు. అయితే ఈ గడ్డి విపరీతంగా పెరిగిపోతూ పెంగ్విన్‌లు నివాసం ఉండే ప్రాంతాలను కప్పేస్తోంది.అంతేకాకుండా ఈ గడ్డిలో చిక్కుకొని ఎటూ కదల్లేక పెంగ్విన్‌లు చనిపోతున్నాయట. గతంలో 40 వేల వరకు ఉన్న ఈ పెంగ్విన్‌ల సంఖ్య ప్రస్తుతం 18 వేలకు చేరుకుంది. అయితే దీనికి స్థానిక అధికారులు ఒక ఉపాయం ఆలోచించారు. పెంగ్విన్‌లను రక్షించడానికి ఆవులను రంగంలోకి దించారు. గడ్డిని ఆవులు మేసేయడంతో పెంగ్విన్‌లకు కష్టాలు తప్పుతున్నాయట.