ఫేస్‌బుక్ ఆఫీసు ముందు నగ్నంగా మోడల్స్ ల #WeTheNipple నిరసనలు

SMTV Desk 2019-06-06 12:16:12  WeTheNipple

న్యూయార్క్: న్యూయార్క్‌లోని ఫేస్‌బుక్ ఆఫీసు ముందు వందల మంది మోడల్స్ నగ్నంగా నిరసన చేపట్టారు. వివరాల ప్రకారం... కళాత్మక నగ్నత్వంపై ఫేస్‌బుక్‌, ఇంస్టాగ్రామ్‌లు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని #WeTheNipple పేరుతో మోడల్స్ నిరసన చేపట్టారు. ఫేస్‌బుక్ ఫోటోలలో మగాళ్లు తమ చనుమొనలు చూపిస్తే ఎలాంటి అభ్యంతరం చెప్పని ఫేస్‌బుక్.. మహిళల చనుమొనలపై ఎందుకు ఆంక్షలు విధించిందని? ప్రశ్నిస్తున్నారు. ఆడవాళ్ల చనుమొనల ఫొటోలను ఫేస్‌బుక్ అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.అమెరికా వివాదాస్పద కళాకారుడు స్పెన్సర్ తునిక్, నేషనల్ కోలిషన్ ఎగైనెస్ట్ సెన్సార్‌షిప్‌తో కలిసి ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాడు. ఆదివారం న్యూయార్క్ వీధుల్లో మోడళ్లు దుస్తులు విప్పి ఆందోళన చేపట్టారు. మన్‌హట్టన్‌ నగరంలోని అస్టర్ ప్లేస్ సబ్‌వే స్టేషన్ వద్ద మోడళ్లు దుస్తులు విప్పేసి చనుమొనలతో ఫోటోలకు ఫోజులిచ్చారు. వారి చనుమొనలకు పురుషుల చనుమొనల స్టిక్కర్లు అంటించుకొని.. వారి జననాంగాలు కనిపించకుండా చనమొనల ప్లకార్డుల అడ్డుపెట్టుకుని నిరసన తెలిపారు. ఫేస్‌బుక్‌లో కేవలం పెయింటింగ్‌ నగ్న చిత్రాలు మినహా మనుషుల నగ్న చిత్రాలకు అనుమతి లేదు. ఇది న్యూడ్‌ ఫొటోగ్రఫీ స్పూర్తిని దెబ్బతీయడేమనని స్పెన్సర్‌ తునిక్ వాపోయారు.