చైనా షిప్ రాకెట్ ప్రయోగం విజయవంతం!

SMTV Desk 2019-06-06 12:11:57  Long March 11 launch, China conducts first Sea Launch mission

బీజింగ్‌: చైనా షిప్ నుండి ప్రయోగించిన రాకెట్ విజయవంతం అయ్యింది. చైనా ఇలాంటి ప్రయోగం చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఎల్లో సముద్రం నుండి ఈ ప్రయోగాన్ని చేపట్టింది. లాంగ్‌ మార్చ్‌ 11 రాకెట్‌ ద్వారా మొత్తం ఏడు శాటిలైట్స్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. వీటిలో ఒకటి సముద్ర ఉపరితల గాలుల, తుఫాన్ల అధ్యయనానికి సంబంధించిన శాటిలైట్‌ కాగా మరో రెండు కమ్యూనికేషన్‌ శాటిలైట్స్‌ ఉన్నాయి. అయితే చైనా 2030 నాటికి అమెరికాను అందుకోవడంతో పాటు అంతరిక్షరంగంలో ప్రముఖ స్థానంగా నిలవాలనుకుంటుంది.