తమ్ముడు కత్తి.. సూర్యుడి వైపు చూడకు, మాడి మసైపోతావ్.. : బండ్ల గణేష్

SMTV Desk 2017-08-29 12:35:53  PAWAN KALYAN, KATTI MAHESH, BANDLA GANESH, TWITS

హైదరాబాద్, ఆగస్ట్ 29 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ పై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో "తమ్ముడు కత్తి మహేష్, సూర్యుడి వైపు చూడకు. ఆ సూర్య కిరణాలమైన మా లాంటి వారిచేత మాడి మసైపోతావు" అంటూ హెచ్చరించారు. అంతేకాకుండా పవన్ అభిమానులు సైతం.. "నీతి, నిజాయితీ గురించి ఒకరితో చెప్పించుకునే అవకాశం పవర్ స్టార్ కు లేదు, రాదు" అని, "సూర్యుడి గురించి ఆయన శక్తి గురించి ఆలోచించే అంత బుర్ర లేదులే. అందుకే అర్హతకి మించి మాట్లాడుతున్నాడు" అంటూ కత్తి మహేష్ ను తిడుతూ వరుస ట్విట్లను పోస్ట్ చేశారు.