ఈఫిల్‌ టవర్‌పై మరో సాహసోపేతమైన వినోదం ఏర్పాటు

SMTV Desk 2019-05-29 15:25:54  Eiffel Tower zipline

పారిస్‌: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈఫిల్‌ టవర్‌పై సందర్శకుల కోసం మరిన్ని సాహసోపేతమైన వినోదాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈఫిల్‌ టవర్‌ నుంచి కిందకు 800 మీటర్ల మేర జిప్‌లైన్‌ను నిర్మించారు. ఈఫిల్‌ టవర్‌పైకి చేరుకుంటున్న సాహసికులు ఆ జిప్‌లైన్‌ ద్వారా త్వరగా కిందకు రావడానికి వీలుంటుంది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో కిందనున్న భవనంపైకి దూసుకుపోతున్నారు. నెస్లీ గ్రూప్‌కు చెందిన మినరల్‌ వాటర్‌ తయారీ సంస్థ పెరియర్‌ ఈ జిప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది.