హైదరాబాద్, ఆగస్ట్ 25 : దక్షిణాది ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా హిందీ చిత్రం "క్వీన్" ను రీమేక్ చేయాలనుకున్నారు. అయితే హిందీలో విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్న ఈ సినిమాలో కంగన రనౌత్ నటించగా ఇప్పుడు అదే పాత్రను తెలుగులో కాజల్ అగర్వాల్ పోషించనుంది. తొలుత ఈ పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. కాని తర్వాత అమలాపాల్ ను తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అనివార్య కారణాల వల్ల ఈ ఇద్దరు తప్పుకోవడంలో ఈ అదృష్టం కాజల్ ను వరించింది. కాజల్ ఇప్పటికే "నేనే రాజు నేనే మంత్రి", "వివేకం" చిత్రాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకునే అవకాశాలున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.