దుబాయ్‌ నౌకలో అగ్నిప్రమాదం....13మంది భారతీయులు సురక్షితం

SMTV Desk 2019-05-09 14:41:03  Al Jadaf Dubai, Boat fire accident

దుబాయ్‌: దుబాయ్‌ షార్జాలోని ఖలీద్‌ రేవు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. రేవు వద్ద ఓ వాణిజ్య నౌక మంటల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో నౌకలో ఉన్న 6 వేల గ్యాలన్ల డీజిల్‌, 120 వాహనాలు, 300 వాహన టైర్లు బూడిదయ్యాయి. ఈ నౌకలో ఉన్న 13మంది భారతీయ సిబ్బందిని అక్కడి అగ్నిమాపక సిబ్బంది రక్షించాయి. సకాలంలో ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకోవడంతో.. పెనుముప్పు తప్పిందని.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.